ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు.
కరీంనగర్ జిల్లా రామన్నపల్లి గ్రామంలో వరుసగా ముగ్గురు చనిపోవడంతో… ఊరిని ఖాళీ చేస్తున్నారు గ్రామస్థులు. గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వెళ్లి తోటల్లో మకాం పెట్టారు. వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్తులు చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఊరికి అరిష్టం పట్టిందని అందుకే ఊరు చివర చెట్ల కింద కుటుంబ సభ్యులతో కలిసి వంటలు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఊరి చివర ఉండి తిరిగి ఇంటికి వెళ్తామన్నారు. దీనికంతటికి కారణం గ్రామంలో ఇటీవల అనారోగ్యాల బారిన పడి…