శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. హైదరాబాద్ కొత్త పేట ఓజోన్ ఆసుపత్రుల యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉదయం 7.30 గంటల నుంచి ఆరోగ్యానికి నడక ప్రాధాన్యత పై అవగాహన కల్పించేందుకు 5K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాచకొండ ఎల్బీనగర్ డీసీపీ బి. సాయి శ్రీ మాట్లాడుతూ నడక ఆరోగ్యానికి ఎంతో ప్రధానమన్నారు. ఉదయం, సాయంత్రం నడక ఆరోగ్యానికి ఉపకరిస్తుందని తెలిపారు.
Read Also: Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ 5K వాక్ అన్ని వయసుల ప్రజలలో శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి ఉద్దేశించబడిందని డైరెక్టర్లు జనరల్ ఫిజీషియన్ డా. ఇంద్రసేనా రెడ్డి, సీఓఓ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. 5K వాక్ కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్స్ నుండి ప్రారంభమై ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు కొనసాగింది. వాక్ లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. నడక వల్ల అనేక వ్యాధులు దరిచేరవని, యువత నడకను అలవాటుగా మార్చుకోవాలన్నారు.
Read Also: Naresh Pavitra: వీళ్ల ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వచ్చేస్తోంది…