KTR : హైదరాబాద్ టెక్ హబ్‌గా వేగంగా ఎదుగుతోన్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K.T. Rama Rao) విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్ (Sam Altman) భారత్‌లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనకు ‘ఎక్స్’ (X) వేదిక ద్వారా స్వాగతం పలికారు.
Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?
హైదరాబాద్ అనేది ప్రపంచ స్థాయి ఐటీ హబ్ మాత్రమే కాకుండా, ఆధునిక సాంకేతికతలకు అనువైన మౌలిక సదుపాయాలతో ఉన్నదని ఆయన గుర్తుచేశారు. భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్న ఓపెన్ఏఐ వంటి సంస్థలకు హైదరాబాద్ ఆదర్శవంతమైన గేట్‌వే (Gateway) అవుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఐటీ, బహుళజాతి కంపెనీలు, స్టార్టప్‌లు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, స్కిల్డ్ మానవ వనరులు హైదరాబాద్‌లో సమృద్ధిగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు.
ఈ క్రమంలో ఓపెన్ఏఐ హైదరాబాద్‌ను తన ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటే, భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొత్త దిశ నిర్ధేశం అవుతుందని తెలిపారు. కేటీఆర్ స్వయంగా శామ్ అల్ట్‌మన్‌కు ఆహ్వానం పలుకుతూ, “భారత్‌లో అడుగు పెట్టబోతున్న ఓపెన్ఏఐకి హైదరాబాద్ సరిగ్గా సరిపోతుంది” అంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు.