TRS రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఉద్యమ కారులకు స్థానం లేదనేది స్పష్టమవుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ మండి పడ్డారు. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం సిగ్గు చేటని నిప్పులు చెరిగారు. ఇంటికొ బీర్, వీధికొ బారు ఇదే కెసిఆర్ దర్బార్ అంటూ ఎద్దేవ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వాళ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారని గుర్తు చేశారు. చెల్లి కోసమే జగన్ తెలంగాణ వారికి రాజ్యసభ సీట్లు కేటాయించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ.. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు ప్రభాకర్. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని చదవాలని ఎద్దేవ చేశారు. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడాన్ని కేసీఆర్ తప్పు పట్టడం అంటే.. రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని నిప్పులు చెరిగారు.
కల్వకుంట్ల రాజ్యాంగం లో అలా లేదేమో.. అంటూ ఎద్దేవ చేశారు. గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళిక సంఘం ద్వారా విడుదల చేసిన నిధులు సున్నా అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తోంది కేసీఆర్ , పంచాయతీ రాజ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది కేసీఆర్ అంటూ విమర్శించారు.
కేంద్రం ఇచ్చే అవార్డులు స్థానిక సర్పంచ్, ప్రజల వల్లే దక్కాయంటూ గు్ర్తు చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఎఫ్ఆర్బీఎమ్ ను అడిగినప్పుడల్లా కేంద్రం పెంచిందని గుర్తు చేశారు. కమీషన్ లు దొరకవనే అలా మాట్లాడుతున్నారని తెలిపారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది కెసిఆర్ అంటూ మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. 8 ఏళ్లలో లక్ష 26 వేల 772 కోట్ల ఆదాయం మద్యం ద్వారా ఈ ప్రభుత్వంకి వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Hyderabad:టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థలపై కేఏ పాల్ ఫైర్.. వారికా సీట్లు..?