జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవసరమనుకుంటే ప్రత్యేక చట్టాలు కూడా చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. కేంద్ర, రాష్ట్ర ట్యాక్స్ అంటూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఇప్పటికే ఎంతో మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జీఎస్టీపై పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా ఈ సంచనల తీర్పునిచ్చింది. అయితే.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. సామాన్యుడిపై ట్యాక్సుల భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది.