Bus Booking: ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. పెళ్లిళ్ల కోసం బస్ బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్..
- ఆర్మూర్ డిపో మేనేజర్ పి.రవికుమార్ కీలక ప్రకటన..
- పెళ్లిళ్లు-ఇతర వేడుకలకు బస్సు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ..
- ఈ ఆఫర్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వాసులకు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Booking: శ్రావణమాసం అంటే శుభప్రదమైన మాసం. ఈ నెలలో వివాహాలు, గృహప్రవేశాలు జరుగుతాయి. అయితే ఈ వేడుకకు దూర ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులను తీసుకురావడం కష్టమైన పని. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులో రాయితీలను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వాసులకు మాత్రమే నండోయ్ గమనించగలరు అంటూ కూడా తెలిపింది. ఈ మేరకు ఆర్మూర్ డిపో మేనేజర్ పి.రవికుమార్ కీలక ప్రకటన చేశారు.
Read also: Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి
Also Read
పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు బస్సు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా బస్సు బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలా బస్ బుక్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చని అన్నారు. ఏప్రిల్, మే తర్వాత పెళ్లిళ్లకు దాదాపు రెండు నెలల గ్యాప్ వచ్చింది. శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడే కాకుండా.. గృహ ప్రవేశాలు , ఇతర వేడుకలు కూడా నిర్వహిస్తారు. కానీ కొన్నిసార్లు కుటుంబం మొత్తం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో హడావుడిగా ప్రయాణం చేయడం వలన చాలా మంది అలసిపోతుంటారు. అంతే కాకుండా.. అప్పటి కప్పుడు కార్లు, ట్రాలీ వాహనాలు బుక్ చేసుకుని కంగారు పడుతూ బయలుదేరుతు అనుకోని ప్రమాదాలకు గురవుతుంటారు. మీరు సాఫీగా ఆనందంగా వెళ్లేందుకు ఈ బస్సును బుక్ చేసుకోవడం వల్ల ఆ శ్రమ తగ్గుతుంది. మీరు కూడా హాయిగా ప్రయాణం చేయవచ్చంటూ తెలిపారు.
KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!