CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
- ఓటు హక్కును కాపాడేందుకు పార్లమెంట్ వరకు పోరాటం: రేవంత్ రెడ్డి
- ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని సీఎం డిమాండ్
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
- ఇది కాంగ్రెస్ ఉద్యమం కాదు.. ప్రజల ఉద్యమమని రేవంత్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తే.. ఆయనపై చర్యలు తీసుకోవడం దారుణమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను అరెస్టు చేసిందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని అన్నారు.
‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘జీకే గో బ్యాక్’
గతంలో ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో ‘సర్ గో బ్యాక్’, ‘జీకే గో బ్యాక్’ ఉద్యమం కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గతంలో రైతుల ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించినా… చివరకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా ఎంత మొండిగా వ్యవహరించినా జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందేనని పేర్కొన్నారు. అవసరమైతే ఈ వ్యవహారం మరింత ముందుకు వెళ్లి ప్రధాని రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని అన్నారు.
Also Read
- CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
- Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
- New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
దేశ ప్రజల ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరు
భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు నేరుగా ఎన్నికల సంఘాన్నే రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఓట్లను తొలగించి తమకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే మోడీ, అమిత్‌షాల అసహనం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పదవులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేతలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఉద్యమం కాదు ఇది… ప్రజల ఉద్యమం
దేశంలోని ప్రజలు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల హక్కులను కాలరాసిన వారికి చరిత్రలో ఎవరూ తప్పించుకోలేదని, చివరకు ప్రజల కోర్టులోనే తీర్పు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాటం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైన ఉద్యమం కాదని, ఇండియా కూటమి, ప్రజల ఉద్యమమని అన్నారు. ప్రజలు ఒక్కటై గొంతెత్తితే ప్రభుత్వం తప్పనిసరిగా వినాల్సిందేనని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగుతారని, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!