Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mokshagna: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞను హీరోగా నిలబెట్టడమే కాకుండా, స్వయంగా బాలకృష్ణే కీలక పాత్రలో మెరవబోతున్నట్లు బలమైన టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కథ ఊహించని మలుపు తిరిగే కీలక సమయంలో బాలయ్య పాత్ర తెరపైకి వస్తుందని తెలుస్తోంది. మోక్షజ్ఞకు రీల్ లైఫ్‌లోనూ తండ్రి పాత్రలోనే ఆయన కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య, మోక్షజ్ఞలను చూస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఈ ప్రచారం నిజమైతే నందమూరి అభిమానులకు థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం.
తనయుడిని వెండితెరకు పరిచయం చేసే విషయంలో బాలకృష్ణ ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వశిష్ట చెప్పిన కథపై బాలయ్య సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ మరింత బలంగా పండాలని కొన్ని కీలక సూచనలు, మార్పులు చేర్పులు చేయించారట. బాలయ్య సూచనల మేరకు దర్శకుడు వశిష్ట స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా సిద్ధం చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలోనే లాంఛనంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి, త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. వెండితెరపై నందమూరి వారసుడి రాక ఖరారవడంతో పాటు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్డెట్స్ వైరల్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
తాజావార్తలు
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!