Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Remove Pilling from Woolen Clothes at Home: చలికాలం వచ్చిందంటే చాలు.. అల్మారాలో దాచిపెట్టిన వెచ్చని స్వెటర్లు, బ్రాండెడ్ కోట్లు, బ్లేజర్లు బయటకు తీస్తుంటాం. చలికి తట్టుకోవడానికి, అలాగే లుక్ పరంగానూ ఇవి చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. అయితే ఎంత అందమైన, ఖరీదైన ఊలు దుస్తులైనా సరే.. కొద్దిరోజులు వాడగానే లేదా ఉతకగానే వాటిపై చిన్న చిన్న రోమాలు, ఉండలు (బబుల్స్) ఊడిపడతాయి. దీనివల్ల ఆ కొత్త బట్టలు కాస్త పాతబడిపోయినట్లు, చూడటానికి బొద్దుగా, అసహ్యంగా తయారవుతాయి. కొన్నిసార్లు ఈ రోమాల గోల తట్టుకోలేక ఇష్టమైన స్వెటర్లను పక్కన పడేస్తుంటాం లేదా వాటిని క్లీన్ చేయడానికి డ్రై క్లీనింగ్, ఫ్యాబ్రిక్ షేవర్లు అంటూ అనవసరంగా డబ్బులు దండగ చేస్తుంటాం. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం రెండు నిమిషాల్లో మన ఇంట్లో లభించే సాధారణ వస్తువులతోనే ఈ రోమాలను సులభంగా వదిలించుకోవచ్చని మీకు తెలుసా?
ఈ సింపుల్ ట్రిక్స్ కోసం మనకి ఇంట్లో సాధారణంగా ఉండే షేవింగ్ రేజర్, పియుమిస్ స్టోన్ (పాదాలు రుద్దే రాయి), డక్ట్ టేప్ లేదా వెల్క్రో స్ట్రిప్, పాత్రలు తోమే స్పాంజ్ (పైన గరుకుగా ఉండే స్క్రచ్ బ్రైట్), అలాగే సన్నని పళ్ళు ఉన్న దువ్వెన ఉంటే చాలు. వీటిని ఉపయోగించి బట్టలపై ఉన్న రోమాలను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అందరికంటే ఎక్కువ రిజల్ట్ ఇచ్చేది షేవింగ్ రేజర్ హ్యాక్. మీ స్వెటర్ లేదా కోట్‌ను మంచం మీద కానీ, టేబుల్ మీద కానీ సమాంతరంగా పరవండి. ఒక చేత్తో గుడ్డను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో పదునైన షేవింగ్ రేజర్‌ను పైనుంచి కిందకు చాలా తేలిగ్గా జరపండి. ఇలా చేస్తే క్షణాల్లో ఆ రోమాలన్నీ తెగిపోయి, మీ బట్టలు మళ్ళీ షోరూమ్‌లో కొన్నంత కొత్తగా మెరిసిపోతాయి.
Also Read
- Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
- India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
- Children's Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
- Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
ఒకవేళ బట్టలపై రోమాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే డక్ట్ టేప్ ట్రిక్ బాగా పనిచేస్తుంది. ప్యాకింగ్ టేప్‌ను గమ్ ఉండే వైపు బయటకు వచ్చేలా చేతికి చుట్టుకుని, స్వెటర్‌పై మెల్లగా తడుముతూ (ట్యాప్ చేస్తూ) రాబట్టాలి. దీనివల్ల ఆ రోమాలు, చిన్న చిన్న దారాలు టేప్‌కు అంటుకుని వచ్చేస్తాయి. అలాగే పాదాల మురికి తీయడానికి వాడే పియుమిస్ స్టోన్‌తో కూడా ఊలు దుస్తులను క్లీన్ చేయవచ్చు. ఈ రాయిని స్వెటర్ లేదా కోట్ మీద ఒకే దిశలో మెల్లగా రుద్దితే, దాని గరుకు ఉపరితలం వల్ల బయటకు వచ్చిన రోమాలన్నీ ఈజీగా ఊడిపోతాయి. ఇక సన్నని పళ్ళున్న ప్లాస్టిక్ దువ్వెనతో కూడా ఈ పనిని పూర్తి చేయవచ్చు. స్వెటర్‌ను సమాంతరంగా పరిచి దువ్వెనతో తేలికగా దింపితే, ఆ ఉండలన్నీ దువ్వెన పళ్ళలో చిక్కుకుని బయటకు వచ్చేస్తాయి. కేవలం రోమాలు తీసేయడమే కాదు, అసలు బట్టలపై రోమాలు రాకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. అందుకోసం ఉతికే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వేడి దుస్తులను ఉతికేటప్పుడు ఎప్పుడూ లోపలి వైపును బయటకు తిరగేసి (ఉల్టా చేసి) మాత్రమే ఉతకాలి. అలాగే వీటిని వాషింగ్ మెషీన్లో వేయడం కన్నా, లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించి చేత్తో ఉతకడమే చాలా మంచిది. ఒకవేళ మెషీన్లో ఉతకాల్సి వస్తే మాత్రం తప్పకుండా ‘జెంటిల్’ లేదా ‘వూలెన్’ మోడ్‌నే ఎంచుకోవాలి. దీనివల్ల బట్టల మధ్య ఘర్షణ తగ్గి, రోమాలు రాకుండా దుస్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!