Farmers of Nizamabad: రైతులు వినూత్న నిరసన.. మా ఎంపీ తెచ్చిన పసుపుబోర్డు ఇదే అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers of Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తే నిజామాబాద్ రైతులు గళం విప్పారు. ఈసారి వినూత్నంగా నిరసన తెలిపారు. పసుపు బోర్డుకు పంగనామం పెట్టారని నిజామాబాద్ రైతులు నిరసనకు దిగారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన లేదని వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్‌లో ప్రకటించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంట్ వేదికగా మరోసారి మోసం బయటపడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిరసన తెలిపారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా పసుపు బోర్డు ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇది మా ఎంపి గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ ఖాళీ పసుపు హార్దింగ్ లు, ప్లెక్సీలు రైతులు కట్టారు. స్థానిక ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ,బోధన్,ఆర్మూర్ లలో వెలిసిన హోర్దింగ్ లు, ప్లెక్సీలు పసుపు బోర్డులు దర్శినమిస్తుండటంతో ఆశక్తిగా జనం చూస్తున్నారు.
గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఓట్లు పొందిన ధర్మపురి అరవింద్ తమను మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బాండ్ పేపర్ రాసినా ఇప్పటికీ పసుపు బోర్డు సాధించలేదని, బోర్డు పెట్టలేమని కేంద్రం చెబుతున్నా ఏమీ జరగడం లేదని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పసుపుబోర్డు తీసుకురాకుంటే రాజీనామా చేస్తానని ఎన్నికల సమయంలో అరవింద్ చెప్పారని, నాలుగున్నరేళ్లు దాటినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నేతలు ప్రజలకు తిరిగే నైతిక హక్కు లేదన్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ అగ్రనేతలు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రామ్ మాధవ్ కూడా మోసపూరిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
గత కొంత కాలంగా పసుపు బోర్డు కోసం రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ధర్మపురి అరవింద్‌ను రైతులు చాలాసార్లు అడ్డుకున్నారు కూడా. ఆయన ఇంటి ముందు ఇసుక కుప్పలు వేసి నిరసన కూడా తెలిపారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి పసుపుబోర్డు కోసం ఆందోళనలు చేస్తామని, ధర్మపురి అరవింద్ ను తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు చెబుతున్నారు. మరి దీనిపై ధర్మపురి అరవిందే ఏవిధంగా స్పందించనున్నారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!