దేశ ప్రజలకు ఒక్కటే గ్యారంటీ.. అది మోడీ గ్యారంటీ తప్ప వేరే ఏ గ్యారంటీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని బ్రహ్మ లింగేశ్వర టీ పాయింట్ దగ్గర చాయ్ పే చర్చలో ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తే నిజామాబాద్ రైతులు గళం విప్పారు. ఈసారి వినూత్నంగా నిరసన తెలిపారు. పసుపు బోర్డుకు పంగనామం పెట్టారని నిజామాబాద్ రైతులు నిరసనకు దిగారు.
నిజామాబాద్ మార్కెట్లో ఈ రోజు పసుపు పంటకు క్వింటాల్ కు 10 వేల రూపాయలు ధర పలికిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. పంట కుళ్లి పోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారని, అలాంటి పంట తక్కువ ధర పలుకుతుందని, అలాంటి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి కి లేఖ రాయడం…