కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు రైతులు మరింత వృద్ధిలోకి రావాలని ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ మోడీ సర్కార్ బోర్డ్ ఏర్పాటు చేసింది.. మోడీ ఏది చెప్పినా చేసి తీరతారు.. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడు.. ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉంది.. నిజామాబాద్ పసుపు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఓ ప్రత్యేక…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందని చెప్పారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందని వెల్లడించారు.
MLC Kavitha : నిజామాబాద్ పసుపు యార్డు ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు యార్డులో.. రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారం రోజులుగా ధరలు పడిపోయాయన్నారు. కేంద్రం 15 వేలు మద్దతు ధర ఇస్తామని గొప్పలు చెప్పి రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు కు చట్ట బద్దత లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ లో బిల్లు పెట్టీ .. బిల్లు పాస్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, పసుపు…
MLC Kavitha: నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా ఉంది.. పార్లమెంట్ సభ్యురాలిగా తాను ఐదేళ్లు లోక్ సభలో పసుపు బోర్డు కోసం కోట్లాడాను అన్నారు.
పసుపు బోర్డుపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల స్పందించారు. ఎంపీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. నువ్వెక్కడ పోయావని అడిగినా ప్రశ్నకు... తాను కేంద్రానికి రాసిన లేఖలు విడుదల చేశారు.
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్‌గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్…
జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. సాక్షాత్ ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్‌గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ( అక్టోబర్ 3వ తారీఖు) నిజామాబాద్ కు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు.