Hyderabad Kidnapping Case: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కిడ్నాప్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని మాదన్నపేటలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ కు గురైన కొద్ది గంటల్లోనే సీసీ కెమెరాల చాకచక్యంగా పాపను కిడ్నాప్ చెరనుంచి సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్ లో జహీరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు పోలీసులు. జహీరాబాద్ పోలీసులను.. మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. దీంతో అప్రమత్తమైన జహీరాబాద్ పోలీసులు బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. కుటుంబసభ్యులకు చిన్నారిని అప్పగించి జహీరాబాద్ నుండి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎంజీబీఎస్ లో కిడ్నాప్ చేసిన మహిళ జహీరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితమే కిడ్నాప్ కు గురైన చిన్నారి ఇంట్లో మహిళ సహనాజ్‌ఖాన్ పని మనిషిగా చేరినట్లు పోలీసులు గుర్తించారు.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్!
పాతబస్తీ మాదన్న పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడలోని నర్సింగ్‌హోమ్ ఆస్పత్రి నుంచి 9 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. ఆ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షహనాజ్‌ఖాన్ ఇంట్లో పని ముగించుకుని పసికందుతో పారిపోయినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. షహనాజ్‌ఖాన్ ఇచ్చిన ఐడీ ప్రూఫ్ ప్రకారం అతడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధితులు మాదన్న పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇంటి సమీపంలోని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసి కేసు ఛేదించారు. రాష్ట్రంటో చిన్న పిల్లల బ్యాచ్ తిరుగుతున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే… హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో 9 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురి కావడంతో తల్లిదండ్రులు భాయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Wine Shops: జీహెచ్ఎంసీలో సీసీటీవీ కెమెరాలు.. వైన్ షాపులు కవర్ అయ్యేలా ఏర్పాట్లు