Hyderabad Kidnapping Case: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కిడ్నాప్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని మాదన్నపేటలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది.
మలక్ పేట, చంచల్ గూడ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ లతో యువకులు రెచ్చిపోయారు. కొంతమంది యువకులు సాయంత్రం, తెల్లవారుజామున రేసింగ్‌లు చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అత్యంత వేగంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
నేడు చంచల్ గూడ జైలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ఆయన ములాఖత్ అవనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. జైలులో ఉన్న అభ్యర్థుల కోసం న్యాయవాదులను కూడా నియమించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు…