నకిలీ నోట్లు ముద్రించారు. వాటి చలామణి కోసం ఏకంగా ఫేక్ కరెన్సీ పేరుతో ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ..జనాలను పోగు చేశారు. నకిలీ నోట్లు ముద్రిస్తూ కొరియర్‌లో పంపుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నారు. బీహార్‌లో ఓ మారుమూల గ్రామాన్ని నకిలీ నోట్ల తయారీకి కేంద్రంగా చేసుకుని.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఠాను నిర్వహిస్తున్నాడు. కామారెడ్డిలో రెండు దొంగనోట్ల బయటపడటంతో.. తీగ లాగితే దొంగ నోట్ల రాకెట్ బయటపడింది. Also Read:Vishnu…
BJP MLA Katipally: బీజేపీ పదాధికారుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభ బీజేపీకి కనువిప్పు కలిగించేలా, రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పేలా నిలుస్తుందని బీజేపీ నేత మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు" అని వ్యాఖ్యానించారు.
కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో భారీ వరదలు సంభవించాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ర్వైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్దరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్దరించారు. తలమాడ్ల వద్ద ట్రాక్ మరమ్మత్తులు పూర్తయ్యాయి. మరమ్మత్తులు పూర్తి కావటంతో…
కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చోటుచేసుకున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బీబీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా మారింది. చెరువుకు బుంగ పడటం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా బీబీపేట దిగువన ఉన్న షేర్ బీవీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యా శాఖ. Also Read: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అల్పపీడనం కొనసాగుతున్నందున కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ లో పరిస్థితి మళ్ళీ చాలా దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రాబోయే 4 గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది. Also Read:Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10…
కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. కాగా బిబిపేట్ మండలం యాడారం చెరువులో తొమ్మిది మంది చిక్కుకున్నారు. పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావులకు వద్దకు వెళ్లారు గ్రామస్తులు. Also Read:Astrology: ఆగస్టు 28, గురువారం దినఫలాలు నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో బారీ వరదలు సంభవిస్తున్నాయి. కాలనీల్లోని రోడ్లు ఏరులైపారుతున్నాయి. ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డిలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. హావేలిఘనపూర్ మండలంలో వర్షం వణికించింది. ధూప్ సింగ్ తండా, తిమ్మాయిపల్లి, నాగపూర్, వాడి గ్రామాలను వరద ముంచెత్తింది. ఇండ్లలో నీళ్లు చేరి గ్రామాల్లో రోడ్లపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది వరద.…
కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం దేవుడెరుగు.. భర్తలను సరాసరి కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. వివాహేతర సంబంధాల కారణంగానే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను అంతమొందించేందుకు ఏకంగా సుపారీలు ఇచ్చి మరి ప్రాణాలు తీయిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో భర్త హత్యకు భార్య తన ప్రియుడికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకు భార్య ప్లాన్ చేసింది.…