హైదరాబాద్ ఓల్డ్‌సిటీ ఛత్రినాక పేలుడు కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. టపాసులతో పాటు కెమికల్ పెట్టి మరీ యువకులు పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గుంతలో టపాసులు పెట్టిన.. కొందరు యవకులు.. దానితో పాటు కెమికల్స్ మిక్స్ చేశారు. గుంతలో కెమికల్స్, టపాసులు కలవడంతో పేలుడు తీవ్రత పెరిగింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించారు. కాగా, ఛత్రినాక కందికల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది.. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాధ్ (30) గా గుర్తించారు. చనిపోయిన వారు విగ్రహ తయారీ కార్మికులుగా పనిచేసేవారు.. అయితే, మొదట, విగ్రహ తయారీ పరిశ్రమలో బాణసంచా తయారీ కారణంగానే ఈ పేలుడు సంభవించిందని భావించారు.. కానీ, టపాసులతో పాటు కెమికల్ పెట్టి పేల్చినట్టు తేల్చారు పోలీసులు..