Valentine Agreement: పెళ్లి అనేది నూరేళ్ల బంధం.. ప్రేమలో ఎంత కాలం ఉన్నా ఆఖరికి పెళ్లితోని ఒక్కటి అవ్వాల్సిందే. అలా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఓ ప్రేమ జంటకు సంబంధించిన విచిత్రమైన అగ్రిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆగ్రిమెంట్ పేరుతో దంపతులు ఎలాంటి షరతులు విధించుకున్నారో తెలిస్తే నవ్వు ఆగకమానదు. నిన్న అంటే ఫిబ్రవరి 14న ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఎంతో ఘనంగా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఈ రోజును తమ జీవితంలో మార్చిపోలేని విధంగా మార్చుకుంటారు. ప్రేమించుకున్న వాళ్లు ఆ రోజున పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. కారణంగా ప్రతేడాది ప్రేమికుల రోజునే పెళ్లి రోజుగా మార్చుకోవచ్చని భావిస్తుంటారు. అలా ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఓ ప్రేమ జంటకు సంబంధించిన విచిత్రమైన అగ్రిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Vizag: నవ వధువు మృతి కేసులో వెలుగులోకి భర్త అఘాయిత్యాలు
పెళ్లి అయి రెండేళ్లు పూర్తయిన తర్వాత భార్యాభర్తలు ఓ అగ్రిమెంట్ విచిత్రమైన అగ్రిమెంట్ రూపొందించుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా అనయ, శుభమ్ అనే దంపతులు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భర్తకు భార్య పెట్టిన షరతులు ఏంటంటే.. ‘‘1) భోజనం చేసేటపుడు కుటుంబ సంబంధ విషయాలు మాత్రమే మాట్లాడాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి మాట్లాడకూడదు. 2) బెడ్రూమ్‌లో స్టాక్ మార్కెట్ లాభాలు, నష్టాల గురించి మాట్లాడకూడదు. 3) నన్ను (అనయ) బ్యూటీ కాయిన్, క్రిప్టో పై అని పిలవడం మానేయాలి 4) రాత్రి 9 గంటల తర్వాత ట్రేడింగ్‌కు సంబంధించిన యాప్స్, వీడియోలు చూడకూడదు’’ అని భర్తకు కండీషన్లు పెట్టింది.
Read Also:Canada : చండీగఢ్ లో దాచుకున్న కెనడాలో కోట్ల బంగారం దోచుకున్న దొంగ
అలాగే భర్త కూడా భార్యకు కొన్ని షరతులు పెట్టాడు. ‘‘1) శుభమ్ ప్రవర్తన గురించి అమ్మకు ఫిర్యాదు చేయడం అనయ మానేయాలి. 2) వాదన సమయంలో శుభమ్ మాజీ ప్రేయసి ప్రస్తావన తీసుకురాకూడదు. 3) ఖరీదైన స్కిన్ కేర్ ఉత్పత్తులు కొనకూడదు. 4) స్విగ్గీ, జొమాటో నుంచి రాత్రి పూట ఫుడ్ ఆర్డర్ చేయకూడదు’’ అంటూ భార్యకు భర్తకు కండీషన్స్ పెట్టాడు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే.. మూడు నెలల పాటు బట్టలు ఉతకాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలని, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఈ ఫన్నీ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Agreement kalesh between husband and wife 😂💀 pic.twitter.com/tm7Km6VYkU
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 12, 2025