Munugode Bypolls: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ సభలు.. 30న కేసీఆర్, 31న నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode Bypolls: తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్. ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు వేగవంతం చేసింది. అయితే..ఇప్పటివరకూ ప్రచారం ఓ మోస్తరుగా జరిగింది. అయితే.. దీపావళి పండుగ రావడంతో రెండు రోజులు సొంతూళ్లకు వెళ్లారు నేతలు. అయితే.. మునుగోడులో క్లైమాక్స్ ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా.. అక్టోబర్ 30న చండూరు మున్సిపాలిటి పరిధిలోని బంగారిగడ్డ వద్ద సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మనుగోడు ప్రచారం మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా కేసీఆర్ ప్రచారం చేస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని టాక్.. అయితే టీఆర్ఎస్ కు ధీటుగా వెళ్లేందుకు బీజేపీ ప్లాన్ వేస్తుంది. తెలంగాణలో అధికారం కోసం ఎదురుచూస్తున్న కమలనాథులు అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈసభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎంపీ లక్ష్మణ్.. పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు బీజేపీ నిర్వహించనున్న సభకు హాజరవుతారని టాక్.
Read also: Mallikarjun Kharge: కాంగ్రెస్ కొత్త సారథిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
- Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
అయితే.. ఇదంతా చూస్తే ఆగస్టులో సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక, ఆగస్టు 21న సీఎం కేసీఆర్ మునుగోడులో సభ నిర్వహించారు. ఆతరువాత రోజు ఆగస్టు 22న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక మరోసారి కేసీఆర్ సభలో పాల్గొన్న తరువాత మరుసటి రోజే జేపీ నడ్డా బీజేపీ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈనేపథ్యంలో.. దీపావళి పండుగ సమయంలోనూ నియోజకవర్గంలోనే ఉండి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితులను పర్యవేక్షించి, నడ్డా సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించే ప్రయత్నాల్లో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు.
Rapolu Anand Bhaskar Resigns: బీజేపీకి రాపోలు రాజీనామా.. నడ్డాకు లేఖ..
తాజావార్తలు
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!