POCSO : నల్గొండలో బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడైన మహ్మద్ ఖయ్యూమ్‌కు 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారు. 2021లో మహ్మద్ ఖయ్యూమ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి నుండి ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. సుదీర్ఘ విచారణ తర్వాత, కోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పు సమాజంలో ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. బాలికల భద్రతకు పోక్సో కోర్టులు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ఈ తీర్పు రుజువు చేసింది.
Jayam Ravi : ‘దేవుడిని మోసం చేయలేవు’.. జయం రవి టూర్‌పై ఆర్తి కౌంటర్