Nagam Janardhan Reddy: నేడు బీఆర్ఎస్ లోకి నాగం జనార్దన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagam Janardhan Reddy: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నేడు నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్.. జనార్దన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. నాగం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగం మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని కార్యకర్తల సాక్షిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను కలవరపెడుతున్నాయన్నారు.
ముందుగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. నేడు తెలంగాణలో అభివృద్ధికి నాంది పలికేందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడ్డుకుంటారని అన్నారు. నాగర్ కర్నూల్ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్వాన్న స్థితికి చేరుకుందని, చేవెళ్ల కాంగ్రెస్ సభకు 50 వేల మందిని తరలించారన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని విమర్శించారు. డబ్బున్న వారికే కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. పార్టీ జెండాలు మోసే వారికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వరని అన్నారు. మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి పని చేస్తానన్నారు. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ను అవమానించారని మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. నాగంతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డికి తనయుడు లాంటివాడని అన్నారు.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!