Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veg Omelette: ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా వెరైటీగా, అలాగే ఆరోగ్యకరంగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే శనగపిండితో చేసే ఈ ‘వెజ్ ఆమ్లెట్’ అద్భుతమైన ఎంపిక. దీని తయారీకి గుడ్డు అస్సలు అవసరం లేదు. కేవలం కూరగాయలు, శనగపిండి ఉంటే చాలు.. ఐదు నిమిషాల్లో కమ్మటి, కరకరలాడే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడే ఈ టేస్టీ ‘వెజ్ ఆమ్లెట్’ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.
తయారీకి కావాల్సిన పదార్థాలు:
* శనగపిండి – 1 కప్పు
* ఉల్లిపాయ – 1 (మీడియం సైజు, సన్నగా తరిగినది)
* టమోటా – 1 (చిన్నది, సన్నగా తరిగినది)
* పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
* క్యాప్సికమ్ ముక్కలు – కొద్దిగా (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1/2 టీస్పూన్
* పసుపు – 1/2 టీస్పూన్
* కారం – 1 టీస్పూన్ (లేదా రుచికి సరిపడా)
* ఉప్పు – రుచికి సరిపడా
* ధనియాల పొడి – 1/2 టీస్పూన్
* గరం మసాలా – 1/2 టీస్పూన్
* చాట్ మసాలా – 1/4 టీస్పూన్
* నీళ్లు – పిండి కలుపుకోవడానికి సరిపడా
* నూనె లేదా నెయ్యి – కాల్చుకోవడానికి సరిపడా
* బ్రెడ్ స్లైసెస్ – ఆప్షనల్ (శాండ్విచ్ లాగా కావాలనుకుంటే)
Also Read
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
తయారీ విధానం..
పిండి మిశ్రమం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో శనగపిండిని వేయాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ముక్కలను జోడించాలి. ఇందులోనే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి అన్ని పదార్థాలు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఆమ్లెట్ మిశ్రమంలాగా మరీ చిక్కగా కాకుండా.. అలాగని మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమంపై మూతపెట్టి సుమారు పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి చక్కగా నానుతుంది. ఒకవేళ పిండి బాగా చిక్కబడినట్లు అనిపిస్తే కాసిన్ని నీళ్లు చేర్చి సరిచేసుకోవచ్చు.
కాల్చుకునే విధానం
స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకుని వేడెక్కనివ్వాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. ఇప్పుడు తయారుచేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఒక గరిటెడు తీసుకుని పెనంపై వేసి, ఆమ్లెట్ లాగా గుండ్రంగా సమానంగా పరవాలి. మంటను పూర్తిగా లో-ఫ్లేమ్‌లో ఉంచి, మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి, పైభాగంలో కూడా కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. ఆ తర్వాత నెమ్మదిగా రెండో వైపునకు తిప్పి, మళ్లీ మూతపెట్టి మరో నిమిషం పాటు వేగనివ్వాలి. మొత్తం మీద సుమారు నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో రెండు వైపులా చక్కగా వేగి, మంచి రంగు వచ్చి క్రిస్పీగా తయారవుతుంది.
సర్వింగ్
ఇలా చక్కగా కాలిన వెజ్ ఆమ్లెట్‌ను నేరుగా టమాటా సాస్ లేదా ఏదైనా చట్నీతో తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. మరింత వెరైటీగా కావాలనుకుంటే, బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఈ ఆమ్లెట్‌ను ఉంచి టోస్ట్ చేసుకుని శాండ్విచ్ లాగా కూడా సర్వ్ చేయవచ్చు. తక్కువ సమయంలో, ఇంట్లోని పదార్థాలతోనే ఎంతో సులువుగా పూర్తయ్యే ఈ హెల్దీ వెజ్ ఆమ్లెట్‌ను మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.
తాజావార్తలు
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!