Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర పెంపు
- అన్ని 9 కలర్ ఆప్షన్లపై గరిష్ఠంగా రూ.2,000 వరకు ధర పెరిగింది.
- రెడ్డిచ్ రెడ్ బేస్ వేరియంట్ ధర రూ.1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).
- మద్రాస్ రెడ్ రూ.1.96 లక్షలు, మెడాలియన్ బ్రాంజ్ రూ.2.01 లక్షలు.
- కమాండో సాండ్, గోర్ఖా ఎడిషన్ ధర రూ.2.12 లక్షలు.
- గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్ రూ.2.21 లక్షలు కాగా, ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ ధర రూ.2.26 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Enfield Classic 350: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన బెస్ట్ సెల్లింగ్ బైక్ క్లాసిక్ 350 ధరలను కాస్త స్వల్పంగా పెంచింది. దీనితో మొత్తం 9 కలర్ ఆప్షన్లపై ధరల పెంపు ప్రభావం పడింది. వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.2,000 వరకు ధర పెరిగింది. ఎంట్రీ లెవల్ రెడ్డిచ్ రెడ్ నుంచి ప్రీమియం ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ కలర్ వరకు కొత్త ధరలు వర్తిస్తాయి.
పెరిగిన ధరల విషయానికి వస్తే.. క్లాసిక్ 350లో బేస్ వేరియంట్ రెడ్డిచ్ రెడ్ ధర ఇప్పుడు రూ.1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మద్రాస్ రెడ్ ధర రూ.1.96 లక్షలు కాగా, మెడాలియన్ బ్రాంజ్ ధర రూ.2.01 లక్షలుగా ఉంది. ఇక కమాండో సాండ్, గోర్ఖా ఎడిషన్ ధరలు రూ.2.12 లక్షలుగా ఉన్నాయి. గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్ వేరియంట్ల ధర రూ.2.21 లక్షలకు చేరింది. టాప్-స్పెక్ ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ కలర్ వేరియంట్ల ధరలు రూ.2.26 లక్షలుగా ఉన్నాయి. గత ఆగస్టులో మార్కెట్లోకి వచ్చిన గోర్ఖా ఎడిషన్‌పై సుమారు రూ.1,000 మాత్రమే ధర పెరగగా, ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ వేరియంట్లపై పూర్తి రూ.2,000 పెంపు నమోదైంది.
Also Read
- MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ధర పెరిగినప్పటికీ.. బైక్ మెకానికల్‌గా ఎలాంటి మార్పులకు గురికాలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో అదే 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 20.2hp పవర్, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. 2026లో చేసిన అప్డేట్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్లకు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు వచ్చాయి. అయితే బేస్ సింగిల్ ఛానల్ రెడ్డిచ్ రెడ్ వేరియంట్లో ఈ రెండు ఫీచర్లు అందుబాటులో లేవు.
క్లాసిక్ 350 ధరల పెంపు సమయంలో ఈ బైక్‌కు పోటీగా కొత్త మోడళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ట్రయంఫ్ ఇటీవల బొన్నెవిల్లే T4ను రూ.2.55 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇందులో 350cc ఇంజిన్ ఉంది. అదే విధంగా ట్రయంఫ్ బొన్నెవిల్లే T40ను రూ.2.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకొచ్చింది. వీటితో పాటు హోండా CB350 కూడా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కు ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!