CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
- రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- రాహుల్‌ను కలిసేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
- ‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘ఎస్ఐఆర్ గో బ్యాక్’ ఉద్యమం: రేవంత్
- నిరసనల్లో ఎంపీ రఘురాంరెడ్డికి గాయాలు.. ఢిల్లీలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విపక్షాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు బారాఖంబ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని కలవడానికి బారాఖంబ పీఎస్‌కు చేరుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ వద్దే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. మరోవైపు బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో నిరసన తెలుపుతున్న ఎంపీలపై పోలీసులు ప్రయోగించిన లాఠీఛార్జ్‌లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు లాఠీ దెబ్బలు తగలడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.
‘సైమన్ గో బ్యాక్’ తరహాలోనే ‘ఎస్ఐఆర్ గో బ్యాక్’: రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. “ఓట్ల అక్రమాలు, నమోదు ప్రక్రియలో జరుగుతున్న మోసాలపై రాహుల్ గాంధీ నాయకత్వంలో మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. ప్రధానంగా ఎస్ఐఆర్ (SIR) విధానాన్ని రద్దు చేయడంతో పాటు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. వందేళ్ల క్రితం దేశంలో ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం ఎలా నడిచిందో, ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా అంతే స్థాయిలో ‘ఎస్ఐఆర్ గో బ్యాక్’ ఉద్యమం సాగుతోందని పేర్కొన్నారు.
Also Read
- ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
- Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
- OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
- Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ఈడీ, సీబీఐల తరహాలోనే ఈసీ వినియోగం: రాహుల్ అరెస్ట్‌పై మండిపాటు
రాహుల్ గాంధీ అరెస్టుతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల తీవ్ర అసహనం స్పష్టంగా బయటపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు ప్రతిపక్షాలను వేధించడానికి ఈడీ, సీబీఐ వ్యవస్థలను వాడుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు స్వతంత్ర వ్యవస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని (EC) కూడా రాజకీయ ప్రయోజనాల కోసం దారుణంగా వాడుకుంటోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని, ప్రజాస్వామ్య రక్షణ కోసం రాహుల్ గాంధీ అడుగుజాడల్లో తాము పోరాటం ఆపేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!