IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- 6.87 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్.
- 6nm ఆధారిత యూనిసోక్ టీ7300 ఆక్టా-కోర్ చిప్సెట్.
- 50MP ప్రధాన కెమెరా + 2MP సెకండరీ కెమెరా, ముందు 8ఎంపీ సెల్ఫీ కెమెరా.
- 8,000mah భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y32: వివో నుండి Y సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో Y32ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఇందులో భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, IP68+IP69 రేటింగ్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ సన్‌సెట్ ఆరెంజ్, ట్విలైట్ రెడ్ కలర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.
బంగ్లాదేశ్ మార్కెట్లో ఈ మొబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర BDT 30,999 (సుమారు రూ.24,300)గా ఉంది. అలాగే 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర BDT 34,999 (సుమారు రూ.27,000)గా నిర్ణయించారు. ఇక ఇందులో 6.87 అంగుళాల HD LCD డిస్ప్లే అందించారు. ఇది 1,592×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 255ppi పిక్సెల్ డెన్సిటీ, 83 శాతం NTSC కలర్ గామట్, గరిష్ఠంగా 1,300 నిట్స్ HBM బ్రైట్నెస్ ఉన్నాయి.
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
పనితీరు కోసం 6nm ఆధారిత Unisoc T7300 ఆక్టా-కోర్ చిప్సెట్ అందించారు. అలాగే ఇందులో గరిష్ఠంగా 6GB LPDDR4X RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. అదనంగా 6GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా f/2.0 అపర్చర్‌తో పనిచేస్తుంది. దీనికి 2MP సెకండరీ సెన్సార్ జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా అందించారు.
Vivo Y32లో ప్రధాన ఆకర్షణగా 8,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 14 గంటల వరకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, 4G కాలింగ్‌లో 59 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, BeiDou, Galileo, QZSS, USB టైపు C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో పాటు SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!