UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అంశం UPI చెల్లింపులపై ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు వ్యవహారం.. ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి పెద్ద దుమారమే రేగింది.. కొంతమంది అనుకూలంగా ఉన్నా.. మెజార్టీ ప్రజలు, వ్యాపారులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.. రూ.2,000కు మించిన కొన్ని UPI మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం MDRను అక్టోబర్ 15, 2026 నుంచి అమలు చేయాలని NPCI ఇప్పటికే నిర్ణయించింది. అయితే పండుగ సీజన్ నేపథ్యంలో దీన్ని జనవరి 2027 వరకు వాయిదా వేయాలని వ్యాపార, ఫిన్‌టెక్, చెల్లింపుల సంస్థలు కోరుతున్నాయి. ఈ డిమాండ్‌పై NPCI, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
రూ.2,000 దాటితే ఎంత MDR?
ప్రస్తుత ప్రతిపాదిత విధానం ప్రకారం అర్హత కలిగిన Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై రూ.2,000 దాటితే 0.4 శాతం MDR వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.2,000 లావాదేవీపై రూ.8, రూ.10,000 చెల్లింపుపై రూ.40 MDR అవుతుంది. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300కే పరిమితం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే P2P చెల్లింపులు మాత్రం ఉచితంగానే కొనసాగుతాయి.
Also Read
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
వినియోగదారులపై భారం పడుతుందా?
MDR అనేది వినియోగదారులు నేరుగా చెల్లించే రుసుము కాదు. ఇది వ్యాపారులపై విధించే ఛార్జీ. ఈ భారాన్ని వినియోగదారులపై బదిలీ చేయకుండా చూడాలని బ్యాంకులకు సూచనలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.2,000లోపు UPI మర్చంట్ చెల్లింపులు కూడా MDR నుంచి మినహాయింపులోనే ఉంటాయి. అయితే, వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారులపై రుద్దే అవకాశం లేకపోలేదు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది..
ఎందుకు వాయిదా వేయాలని కోరుతున్నారు?
కొత్త MDR విధానంలో వివిధ రకాల లావాదేవీలకు వేర్వేరు రేట్లు, నిబంధనలు ఉండటంతో పేమెంట్ కంపెనీలు, వ్యాపారులకు మరింత సమయం అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్‌లో పండుగ సీజన్ ప్రారంభం కావడంతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త ఛార్జీల విధానం అమలు చేస్తే వ్యాపారులపై అదనపు నిర్వహణ భారం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యేక విభాగాలకు వేర్వేరు ఛార్జీలు
రైల్వే టికెట్లు, ఇంధనం, బీమా, టెలికాం, యుటిలిటీ బిల్లులు వంటి కొన్ని విభాగాలకు 0.4 శాతం బదులు ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ విధించే విధానం ఉంది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు తక్కువ రేటు వర్తిస్తుంది. చిన్న వ్యాపారులు కూడా మినహాయింపు పొందేలా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.
NPCI నిర్ణయంపైనే అందరి దృష్టి
అక్టోబర్ 15 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో MDR అమలు వాయిదాపై పరిశ్రమ చేసిన విజ్ఞప్తిపై NPCI త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం జనవరి 2027 వరకు వాయిదా వేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అయితే తుది నిర్ణయం వెలువడే వరకు అక్టోబర్ 15 నుంచే అమలు అవుతుందనే ప్రస్తుత షెడ్యూల్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?