Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eggshell Uses: కరోనా వచ్చి వెళ్లిన తర్వాత చాలామంది వారి ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు పడుతున్నారు. ఇందులో భాగంగా వారు తినే ఆహారంలో అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు ఉదయం టిఫిన్‌గా గుడ్డులను ఉడికించి తింటున్నారు. ఆ తర్వాత దాని పెంకులను నేరుగా చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ గుడ్డు పెంకులను వ్యర్థంగా భావించి పడేయాల్సిన అవసరం లేదు.
వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందుకే మొక్కల సంరక్షణ నుంచి ఇంటి శుభ్రత వరకు పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లోని వ్యర్థాలను తిరిగి ఉపయోగించాలనుకునేవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మరి వీటిని ఎలా ఉపయోంచవచ్చో చూసేద్దామా..
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
మొక్కలకు సహజ ఎరువుగా..
గుడ్డు పెంకులను బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకుని మొక్కల మట్టిలో కలపవచ్చు. పెంకులు మట్టిలో క్రమంగా కరిగిపోతూ కాల్షియంను అందిస్తాయి. ఇది మొక్కల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టమాటా, మిరప వంటి మొక్కలకు కాల్షియం అవసరం ఉంటుంది. అయితే గుడ్డు పెంకుల పొడిని వెంటనే ప్రభావం చూపించే ఎరువుగా కాకుండా నెమ్మదిగా పోషకాలను అందించే వనరుగా చూడటం మంచిది. వెనిగర్‌తో కలిపి ద్రవ ఎరువుగా కూడా తయారు చేసుకోవచ్చు.
పురుగులను అడ్డుకోవచ్చు
మొక్కల కుండీల్లో నత్తలు, స్లగ్స్ వంటి పురుగుల సమస్య ఉంటే గుడ్డు పెంకులు కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఇందుకోసం పెంకులను పూర్తిగా మెత్తటి పొడిగా కాకుండా కొద్దిగా కాస్త గరుకుగా ఉండేలా నూరి మొక్క చుట్టూ మట్టిపై చల్లాలి. పెంకుల గరుకైన, పదునైన ముక్కలు ఈ పురుగులకు మొక్కల దగ్గరకు చేరుకోవడాన్ని కష్టతరం చేస్తాయి. ఇలా మొక్క చుట్టూ ఒక సహజ అవరోధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇంటి కంపోస్ట్లోనూ
కిచెన్ వ్యర్థాలతో ఇంట్లో కంపోస్ట్ తయారు చేసుకునేవారు గుడ్డు పెంకులను అందులో కలపవచ్చు. ఇవి ఇతర సేంద్రీయ వ్యర్థాల మాదిరిగా త్వరగా కుళ్లిపోవు. అయితే క్రమంగా విచ్ఛిన్నమై కంపోస్ట్లోకి కాల్షియంను అందిస్తాయి. కంపోస్ట్‌లో వేయడానికి ముందు పెంకులను బాగా ఎండబెట్టి చిన్న ముక్కలుగా లేదా పొడిగా చేసుకోవడం మంచిది. దీంతో అవి కంపోస్ట్‌లో సులభంగా కలిసిపోతాయి.
పాత్రల శుభ్రతకు..
వంట చేసేటప్పుడు పాత్రలకు ఆహారం అంటుకుపోవడం లేదా గట్టి జిడ్డు పేరుకుపోవడం సాధారణమే. ఇలాంటి సందర్భాల్లో శుభ్రంగా ఉన్న గుడ్డు పెంకులను స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు. పెంకులను కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌లా చేసి పాత్రపై మృదువుగా రుద్దాలి. పెంకుల గరుకుదనం అంటుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే సులభంగా గీతలు పడే నాజూకైన పాత్రలు, నాన్‌స్టిక్ లేదా సున్నితమైన ఉపరితలాలపై వీటిని ఉపయోగించకపోవడం మంచిది.
జంతువుల ఆహారంలో..
గుడ్డు పెంకులను బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఎండబెట్టి మెత్తటి పొడిగా మార్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో కుక్కలు లేదా కోళ్ల ఆహారంలో కాల్షియం వనరుగా కలపవచ్చు. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి అవసరం. కోళ్లలో గుడ్ల పెంకుల నిర్మాణానికి కూడా కాల్షియం ముఖ్యమైన పోషకం. అయితే జంతువులకు ఆహారంగా ఇవ్వాలనుకుంటే పెంకులను పరిశుభ్రంగా ఉంచి, బాగా ఎండబెట్టి, చాలా మెత్తటి పొడిగా చేయాలి. పదునైన ముక్కలు మిగిలిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువులకు అదనపు కాల్షియం అవసరమా అనే విషయంలో పశువైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇకపై గుడ్డు తిన్న తర్వాత పెంకులను వెంటనే చెత్తబుట్టలో వేయకుండా, వాటిని శుభ్రంగా ఎండబెట్టి సరైన విధంగా ఉపయోగించుకోవచ్చు.
తాజావార్తలు
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?