Munugode By Election Results: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 8గంటల నుంచి మొదలైన మొదటి, రెండు, మూడు, రౌండ్లు త్వరగా వెల్లడించారని నాలుగో రౌండ్ నుంచి ఎందు జాప్యం వస్తుందని, టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను సీఈవో అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో ఎందుకు వెల్లడించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు? అని ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Read also: 29Years Back KTR Bike: 29 ఏళ్ల క్రితం కేటీఆర్ కాలేజీకి ఏ బైక్ పై వెళ్లే వారో తెలుసా !
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే సీఈవో 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేసారు. మునుగోడు ఉప ఎన్నికల రౌండ్ల వారి ఫలితాలు వెల్లడించడంలో CEO విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రౌండ్ రౌండ్ కు బీజేపీ అత్యధిక మెజార్టీ వస్తుండటంతోనే నాల్గోరౌండ్ ఫలితాలు వెల్లడించడానికి జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఫలితాలు వెల్లడించడంలో సీఈవో విఫలమైందని మండిపడ్డారు.