Weather Report : తెలంగాణకు చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు ఆగయా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం కొంత ఆలస్యమైన వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడంతో ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతన్నల్లో కొంత ఆందోళన నెలకొంది. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపాగ్నిలో ఉడికిపోతున్న తెలంగాణ వాసులు సైతం నైరుతు రుతుపవనాల కోసం చూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోని ఇతర భాగాలకు విస్తరిస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
రుతుపవనాల ప్రభావంతో మూడ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 8న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రుతుపవనాల ఆగమనానికి ఆలస్యమైంది.
Also Read
తాజావార్తలు
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?