ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో కొట్లాటలు.. గ్రూప్ రగడ కొత్తమీ కాదు. ఢిల్లీ స్థాయి నేతల మధ్య కూడా గల్లీ లెవల్లో విభేదాలు బయట పడుతుంటాయి. ఒక్కో సెగ్మెంట్‌లో మూడు ముక్కలాటలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ఆయనదో వర్గం ముందుకొచ్చింది. ఈ విధంగా ముగ్గురు కీలక నాయకుల పేర్లు చెప్పి పార్టీ కేడర్ మూడుగా విడిపోయిన పరిస్థితి. ఎవరిని…
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే కావడంతో.. ఆయన రోల్ కీలకంగా మారిపోయింది. దీనిని మంథనిలోని టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట. కాంగ్రెస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే దళితబంధు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో అధికారపార్టీ నేతలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారట. ఈ పథకాన్ని ముందుగా టీఆర్ఎస్…
పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో ఏఐసీసీ , టీపీసీసీ పిలుపు మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కరెంటు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా లేక కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విని చాలా…
విద్యుత్ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ గురువారం విద్యుత్ సౌధ, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలను ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ధర్నా చేసేందుకు అనుమతుల లభించడంతో తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా…
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా రామగిరి కోటను పరిరక్షించాలని శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిప్రతం అందజేశారు. 12వ శతాబ్దానికి చెందిన కోటకు సరైన రహదారి, ఇతర మౌళిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కిషన్‌రెడ్డికి విన్నవించారు. సాంస్కృతిక వారసత్వం, ఔషధ మొక్కల కేంద్రంగా రామగిరి కోట ఉందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు తెలిపారు.…