Errabelli Dayakar Rao Fires On Congress Party Mulugu Sabha: కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను నిందిస్తారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దుయ్యబట్టారు. 75 ఏళ్లు అధికారంలో ఉండి కూడా.. ములుగులో తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవం సభలో కేటీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ములుగు అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. ములుగు ఏజెన్సీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు ములుగుని జిల్లా చేసి, అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామని అన్నారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కరెంట్, మంచి నీళ్ళు ఉండవని.. తెలంగాణలో ఉచిత కరెంట్, ఇంటింటికి మంచినీరు ఇస్తున్నామని చెప్పారు. మేడారం జాతరను రాష్ట్ర పండగ చేసి, కోట్ల నిధులు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు భీమా, రైతు బందు, ఉచిత కరెంట్ ఇచ్చి.. ఆ తర్వాతే మాట్లాడాలని సవాల్ చేశారు. ములుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా.. 30 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
Minister KTR: తెలంగాణ కోటిరత్నాల వీణనే కాదు.. కోటిన్నర ఎకరాల మాగాణి అని కేసీఆర్ నిరూపించారు
అనంతరం మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు తెలంగాణ అభివృద్ధిని స్టడీ చేయడానికి వస్తున్నారన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. సీఎం కేసిఆర్ చొరవతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందని తెలిపారు. ఇదే సమయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మేడారం జాతరకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మేడారం జాతరను కేంద్రం జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కరెంట్ లేని ఏజెన్సీ గూడెం ప్రాంతాలకు కరెంట్ అందించామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు మంచినీరు అందిస్తున్నామని.. 300 పడకల ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చామని తెలియజేశారు. మారుమూల గ్రామాలకు వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్న ఆమె.. అభివృద్ధికి చిరునామాగా ములుగు జిల్లా మారిందని చెప్పుకొచ్చారు.
Ashish Vidyarthi: ఛీఛీ.. ముసలోడు.. రెండో పెళ్లి అంటున్నారు.. చేసుకుంటే తప్పేంటి