Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..
- వైభవంగా ముగిసిన మేడారం మహాజాతర
- కోట్లాది భక్తుల రాక.. అంచనాలకు మించిన సందడి
- విష ప్రచారాలపై మండిపడ్డ మంత్రి
- ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ.. గోదావరి పుష్కరాలపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారం మహాజాతర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గత జాతరల కంటే మెరుగైన ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఆమె కొనియాడారు. ఈ ఏడాది జాతర అంచనాలకు మించి జరిగిందని మంత్రి తెలిపారు. “క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ పీపుల్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో ‘తిరుగు జాతర’ నిర్వహణతో ఈ వేడుకలు పూర్తిస్థాయిలో ముగుస్తాయని వెల్లడించారు.
India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్‌పై కేంద్రం కీలక ప్రకటన..
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
జాతర ఏర్పాట్లపై కొంతమంది కావాలనే విష ప్రచారం చేశారని సీతక్క మండిపడ్డారు. ముఖ్యంగా ఒక చిన్న దొంగతనం ఘటనను భూతద్దంలో చూపిస్తూ, జాతర ఏర్పాట్లు విఫలమయ్యాయనే రీతిలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులను గమనించిన ప్రతిపక్ష నాయకులు సైతం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించడం సంతోషకరమని ఆమె అన్నారు. జాతరలో మంత్రి సీతక్క చేసిన నృత్యంపై వచ్చిన వ్యాఖ్యలకు ఆమె దీటుగా సమాధానమిచ్చారు. “మా ఆదివాసీ సంస్కృతిలో నృత్యం అనేది ఒక భాగం. విదేశాల నుంచి వచ్చే వారు కూడా మా నృత్యాలను ఇష్టపడి చేస్తున్నారు. అలాంటప్పుడు మా సొంత గడ్డపై, మా సంస్కృతిలో భాగంగా నేను నృత్యం చేయడంలో తప్పేముంది?” అని ప్రశ్నించారు.
ఇది తన మూలాలకు, ప్రజలకు ఇచ్చే గౌరవమని స్పష్టం చేశారు. వచ్చే జాతర నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మేడారం చుట్టుపక్కల ఉన్న రోడ్లను వెడల్పు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల గురించి ములుగు జిల్లా పరిధిలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!