MallaReddy IT Raids: ఇవాళ ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. మల్లారెడ్డితో పాటు 16 మంది నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఐటీ ముందు 15 మంది హాజరు కానున్నారు. మహెందర్ రెడ్డి, భద్రారెడ్డి, కీర్తి రెర్డి, మల్లారెడ్డి పెద్ద కోడలు, రాజశేఖర్ రెడ్డి, శ్రేయరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తండ్రి, ప్రవీణ్ రెడ్ది, సంతోష్ రెడ్డి, త్రీశూల్ రెడ్డి, నర్సింహ్మ యాదవ్, జై కిషన్, రాజేశ్వర్ రావు, ఇద్దరు ప్రిన్సిపాల్స్ విచారణకు హజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఐటీ విచారణకు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బయలు దేరారు. నోటీసుల్లో హాజరవ్వాలని మాత్రమే ఉందని, డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు తీసుకురావాలని అధికారులు చెప్పలేదని, ఐటీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఐటీ ముందుకు మంత్రి రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఐటీ ముందుకు హాజరు కావట్లేదని స్పష్టం చేశారు. నేడు ఇంటి నుంచి ఓ పోగ్రామ్ కు మెడ్చేల్ కు వెళ్లిపోయారు మంత్రి. నన్ను ఐటీ వదిలేసింది కానీ, మీడియా వదలట్లేదని మంత్రి అన్నారు. మా కుటుంబం ఐటీ ముందు హాజరవుతారని పేర్కొన్నారు.
Read also: Varisu: తన సినిమాకే ఎక్కువ థియేటర్స్ వస్తాయంటున్న దిల్ రాజు
గత వారం బుధవారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 48 గంటలపాటు మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు ఐటీ నిర్వహించింది. రూ.100 కోట్ల డొనేషన్లు వసూలు చేశారని ఆరోపణలతో ఐటీ సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఇల్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది. రెండు రోజులు పాటు మంత్రి మల్లా రెడ్డి తో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ళు, కాలేజీలలో కొనసాగిన ఐటీ సోదాలు చేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో లభ్యమైన 3 కోట్ల నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాల్లో 18కోట్ల 50లక్షల నగదు,15 కిలోల బంగారం, కీలక పత్రాలను అధికారులు సీజ్ చేశారు. దీనిపై నేటి విచారణలో ప్రశ్నించనున్నారు ఐటీ అధికారులు. ఈ దాడులపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులను తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ విచారణకు సహకరిస్తానని తెలిపారు.