హైదరాబాద్ కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్‌లో మెగాడ్రోన్ షో ఆదివారం జరిగింది. సీఎంఆర్ ఫ్యామిలీ, సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూయలెరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ షో, మెగా డ్రోన్ షో జరిగాయి.
ఇవాళ ఐటీ ముందుకు మంత్రి రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఐటీ ముందుకు హాజరు కావట్లేదని స్పష్టం చేశారు. నేడు ఇంటి నుంచి ఓ పోగ్రామ్ కు మెడ్చేల్ కు వెళ్లిపోయారు మంత్రి. నన్ను ఐటీ వదిలేసింది కానీ, మీడియా వదలట్లేదని మంత్రి అన్నారు. మా కుటుంబం ఐటీ ముందు హాజరవుతారని పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. గతంలో గార్నియర్, లయన్ టీ షర్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన రామ్ తాజాగా సి.ఎమ్.ఆర్ షాపింగ్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. బిజినెస్ రంగంలో 40 సంవత్సరాల అనుభం ఉన్న సి.ఎమ్.ఆర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు రామ్.