Marri Rajashekar Reddy : మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల వద్ద విజ్ఞప్తులు…
మేడ్చల్ మల్కారిగిరి జిల్లా దుండిగల్ పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు.
ఇవాళ ఐటీ ముందుకు మంత్రి రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఐటీ ముందుకు హాజరు కావట్లేదని స్పష్టం చేశారు. నేడు ఇంటి నుంచి ఓ పోగ్రామ్ కు మెడ్చేల్ కు వెళ్లిపోయారు మంత్రి. నన్ను ఐటీ వదిలేసింది కానీ, మీడియా వదలట్లేదని మంత్రి అన్నారు. మా కుటుంబం ఐటీ ముందు హాజరవుతారని పేర్కొన్నారు.
బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాల మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ రైడ్స్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.