రాజన్న సిరిసిల్లలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సీపీఐ పార్టీ కార్మిక భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతుందని.. జమిలి ఎన్నికలు అసాధ్యం అని అన్నారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పిలుపు మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు కులగణన గత ఎన్నికల్లో పిలుపునిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగనన చేపడుతామని హామీ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామని ఆయన తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
Sircilla Textile Industry: సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడింది. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్‌కు 3749 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. నేడు నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొననున్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి అని ఆయన అన్నారు.
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా కూడా పర్యావరణ ప్రేమికుడిగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. పర్యావరణ హితం కోసం సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించారు. తాజాగా ఈ కార్యక్రమం నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకలను…