Minister KTR: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. మద్దతు ప్రకటించినందుకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీఆర్‌ఎస్ టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను సైతం ఈ రెండు జాతీయ పార్టీలు ఆకర్షించలేకపోయాయి. కొంత మంది నేతలు మినహా అసంతృప్త నేతలను బీఆర్ ఎస్ లోనే ఉండేలా శాంతింపజేయడంలో బీఆర్ ఎస్ కొంతమేర సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ విషయంలో కేటీఆర్ బ్రాండ్ రాజకీయం పని చేసిందనే చెప్పాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను పోటీకి దించేందుకు బీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సిద్ధమయ్యారు. కానీ వివిధ కారణాల వల్ల కొందరు పక్కన కూర్చుంటారు. వారిలో తాటికొండ రాజయ్య ఒకరు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి రాజయ్యకు రెండుసార్లు టికెట్ లభించగా, ఈసారి ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ సీటును ఆశిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం కడియంపై కేసీఆర్ మొగ్గు చూపారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజయ్య పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో రాజయ్యను శాంతింపజేసి పార్టీని దెబ్బతీయకుండా అడ్డుకున్నారు. దానికి నిదర్శనమే తాజాగా ప్రగతి భవన్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం అనే చెప్పాలి.
మంత్రి కేటీఆర్ చొరవతో చాలా కాలంగా ఒకరిపై ఒకరు పోరు సాగిస్తున్న మాజీ డిప్యూటీ సీఎంలు తాజాగా ఒక్కటయ్యారు. ఒకరినొకరు కౌగిలించుకుని జోకులు వేసుకున్నారు. కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ ఎస్ లో విభేదాలు సమసిపోయాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని… స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి గెలుపునకు కృషి చేస్తానని రాజయ్య అన్నారు. తన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని… బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన కడియం రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలోనే కడియం, రాజయ్య ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విభేదాలను పక్కనబెట్టి స్టేషన్ ఘన్ పూర్ లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలను ఏకతాటిపైకి తెచ్చి నేతగా మంత్రి కేటీఆర్ మరో అడుగు ముందుకేశారు. తన తండ్రి కేసీఆర్ పార్టీని నిర్మిస్తే కాపాడుకుంటానని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
Ghost: గ్యాంగ్ స్టర్ శివన్న వచ్చేసాడు… సాంగ్ KGF రేంజులో ఉందిగా