కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్… ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు. తలైవర్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కేవలం మూడు సీన్స్ మాత్రమే నటించిన శివన్న… తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. రజినీకాంత్ సినిమాలో రజినీకాంత్ ని డామినేట్ చేసే రేంజ్ లో స్క్రీన్ హోల్డ్ చేయడం అంటే మాటలు కాదు. అలాంటిది శివన్న జస్ట్ ఒక వాక్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు. హుకుమ్ సాంగ్ ని శివన్న నడిచొస్తుంటే… అనిరుద్ హుకుమ్ సాంగ్ ని శివన్న కోసమే రాసాడేమో ఫీల్ అయ్యేలా చేసింది శివన్న స్క్రీన్ ప్రెజెన్స్. అలాంటి శివన్న మొదటిసారి కర్ణాటక బౌండరీలు దాటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న ఈ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు.
‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాని ‘బీర్బల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘శ్రినీ’ డైరెక్ట్ చేస్తున్నాడు. శివన్నతో పాటు ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి కూడా ఘోస్ట్ సినిమాలో నటిస్తుండడంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సందేశ్ నాగరాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న ‘బిగ్ డాడీ’ పాన్ ఇండియా మార్కెట్ లోకి గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. బిగ్ డాడీ పాత్రలో కనిపించిన శివన్న, ప్రతి అభిమానికి వింటేజ్ వైబ్స్ ఇస్తున్నాడు. రోజురోజుకీ ఘోస్ట్ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఘోస్ట్ సినిమా నుంచి “ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్” అంటూ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసాడు. అన్ని భాషలని మిక్స్ చేసి డిజైన్ చేసిన ఈ సాంగ్ KGF సుల్తాన్ సాంగ్ రేంజులో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య పవర్ ట్యూన్ ఇవ్వగా… “వీరధీ వీరుడీడు… వింటేజ్ వాక్ చూడు. వేటాడే వేటగాడు… ఎదురొచ్చే వాడు లేడు” అనే తెలుగు లిరిక్స్ ని చేతన్ రాసి పాడడం విశేషం. సాంగ్ లో శివన్న లుక్స్ అండ్ మేకింగ్ విజువల్స్ కొన్ని చూపించారు, వీటిని చూస్తే భారీ గ్యాంగ్ స్టర్ డ్రామా చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలగడం గ్యారెంటీ.
“Original Gangster Music”
is out now
Ghost in Theatres this oct 19#GHOST #OGM@NimmaShivanna @SandeshPro @jayantilalgada @ArjunJanyaMusic @TSeries @baraju_SuperHit https://t.co/Kj7g9JmGRm pic.twitter.com/ti1BO9mtBj— SRINI (@lordmgsrinivas) September 22, 2023