MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘనపు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రజా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తన వెంట ఉన్న వారు లింగాల గణపురం మండలం కేంద్రంలో జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కాకపోవడం వారిపై ఆయన పరోక్షంగా చురకలాంటించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం సదస్సులో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఈనాడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణం అంటూ ఆయన విమర్శించారు.
ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది అని కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా నా పనితీరు ఉంటుంది..
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటునే ఉన్నారు. అయితే, మరోసారి కడియం శ్రీహరి పైనా ఎమ్మెల్యే రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. జఫర్గడ్ మండల్ హిమ్మత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన �
స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ధర్మసాగరం మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నవ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా సరైన ఆధారాలు సమర్పించలేదని పోలీసులు వెల్లడించారు.