ఎక్కడ రాజీపడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నాం.. చక్కగా కాపాడుకోవాలి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేద ప్రజలకు అందజేస్తామన్నారు. పిల్లిగుడిసెల బస్తీలో ఒకప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు…