Minister KTR Fires On Congress Party In Mahbubnagar Meeting: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ ఎర్రగుట్ట వద్ద రూ.42 కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ నాయకులు వచ్చి, ఇక్కడి ఎమ్మెల్యే గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, జడ్చర్ల ఎమ్మెల్యేను పోయినసారి కంటే డబుల్ మెజారిటీతో గెలిపించి, వాళ్లకు బుద్ధి చెప్పాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గంటల కంటే ఎక్కువ విద్యుత్ వచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండాకాలం వచ్చిందంటే.. నాయకులకు భయం ఉండేదని దుయ్యబట్టారు.
MLA Seethakka: కేటీఆర్ ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.. సీతక్క డిమాండ్
ఉద్దండపూర్, కరివెన ప్రాజెక్టులు నిండితే.. జడ్చర్లలో లక్ష నలబై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు లేక ఈ ప్రాంతం నుండి లక్షలాది మంది వలస వెళ్లేవారని.. ఇప్పుడు ఇదే ప్రారంతం ఇరిగేషన్ అయ్యిందని చెప్పారు. తొమ్మిదేళ్లు నిండిన తెలంగాణలో మన అభివృద్ధిని పండగ చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కడుపునిండా నీళ్లు వస్తున్నాయని, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్‌లను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందన్న ఆయన.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నీళ్లు ఆగస్టులో వస్తాయని తెలిపారు. జడ్చర్లను గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. జడ్చర్ల మున్సిపాలిటీకి ముప్పై కోట్ల నిధులు మంజూరు చేస్తామని మాటిచ్చారు.
MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిందని, 6 లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోజుల్లో పరిశ్రమల కల్పనకు రెడ్ టేప్ ఉంటే.. నేడు రెడ్ కార్పొరేట్ పరుస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30శాతంగా ఉన్న ప్రసూతి.. ఇప్పుడు 60శాతానికి వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు బీమా అందించాలనే ఆలోచన కాంగ్రెస్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని నిలదీశఆరు. ఇక్కడేదో చేస్తామని పీసీసీ చీఫ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.