KTR: హైడ్రా పెద్దవాళ్లని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పేద వల్ల బాధ అందరికీ తెలవాలని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. పేదవాళ్లు కూలి పని చేసుకుని ఇటుక ఇటుక పేర్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చేశారన్నారు. వాళ్లు పెద్దవాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో హైడ్రావల్ల అనేకమంది రోడ్లమీద పడ్డారు..
KTR: తెలంగాణ భవన్‌లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒకవేళ జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే..…
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు..
BRSV Student Meet: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్వి (BRSV), తెలంగాణ జాగృతి సంస్థలు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రెండు సంస్థలూ విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడమే లక్ష్యంగా సెషన్లను ప్లాన్ చేశాయి. హైదరాబాద్ ఉప్పల్ లోని మల్లాపూర్ VNR గార్డెన్స్ లో ఈ రోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి “తెలంగాణ విద్యార్థి సదస్సు” జరగనుంది. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ…
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
KTR: నేడు 71వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న కేసీఆర్ కు పెద్దెతున్న శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తన తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తన అనుభూతులను వ్యక్తం చేశారు. “మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు, తెలంగాణలో అందరికీ హీరోనే” అంటూ ఆయన పేర్కొన్నారు. తాను కేసీఆర్ కుమారుడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు. Read…
BRS : రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.12 వేలకు తగ్గించి తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది . కాపు సామాజిక వర్గానికి సంఘీభావంగా అన్ని జిల్లాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేలు…
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారని.. కేసీఆర్‌ను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోందని విమర్శించారు.
KTR : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఈ ఫిల్మ్‌ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌తో బీఆర్ఎస్…