Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ జీవో ప్రకటిచడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలాభిషేకం చేసారు. గిజనులకి 10% రిజర్వేషన్ పెంచడానికి అసెంబ్లీ తీర్మానం చేసినక కేంద్రo సరిగా స్పందించలేదని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో గిరిజనులకు జనాభా ప్రకారం 10% రిజర్వేషన్ పెంచాలని గట్టి నిర్ణయం తీసుకొని చేశారని అన్నారు. గిరిజన తండాలని గ్రామపంచాయితిగా తీర్చి దిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ దక్కుతుందని అన్నారు. గిరిజన తాండలలో ప్రతి గ్రామ పంచాయితీకి ఒక భవనం ఏర్పాటుకి ఆదేశించిన ఘనత మన సీఎం కేసీఆర్ అని తెలిపారు.
తెలంగాణ రావటంతో గాని, నైజాం వ్యతిరేకంగా చేసిన పోరాటానికి బీజేపీ కి ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ది కోసం తెలంగాణకి వచ్చి బీజేపీ వాళ్ళు పోజులు కొడుతున్నారని అన్నారు. స్వతంత్ర్య ఉద్యమంలోగాని, నిజాం కి వ్యతిరేక పోరాటంలో గాని, భూస్వాముల వ్యతిరేకంలో చేసిన పోరాటంలో గాని, తెలంగాణ సాధించుకున్న దాంట్లో బీజేపీ కి ఎటువంటి పాత్ర లేదు… బీజేపీ వాళ్ళు అమిద్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రాజకీయ లబ్ది కోసం నాటకం ఆడుతున్నారు అని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో.. గిరిజనులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Woman Safely Delivers: అర్ధరాత్రి నడిరోడ్డుపై బిడ్డకు పురుడు పోసిన మహిళా హెడ్ కానిస్టేబుల్