Maoists Encounter: బీజాపూర్ లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
- ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
- భోపాలపట్నం–ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
- మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి
- మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Encounter: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉత్తర–పశ్చిమ ప్రాంతంలో భద్రతా బలగాలకు మరో భారీ విజయం లభించింది. భోపాలపట్నం–ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇంచార్జ్ డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా మొత్తం ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
7.2mm స్లిమ్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధరలో Infinix NOTE Edge లాంచ్.. ధర ఎంతంటే..?
Also Read
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో డీఆర్‌జీ బీజాపూర్, డీఆర్‌జీ దంతేవాడ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు (202, 206, 210 బెటాలియన్లు), సీఆర్‌పీఎఫ్ 214 బెటాలియన్‌కు చెందిన సంయుక్త బృందాలు జనవరి 17న ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జనవరి 17 ఉదయం నుంచి 18 సాయంత్రం వరకు మధ్య మధ్యలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనాస్థలంలో నిర్వహించిన గాలింపుల్లో డీవీసీఎం దిలీప్ బెండ్జా (రూ.8 లక్షల రివార్డు)తో పాటు ఏసీఎం మాడ్వీ కోసా, ఏసీఎం పాలొ పొడియం, ఏసీఎం లక్కీ మడ్కం, పీఎం జుగ్లో బంజామ్, పీఎం రాధా మేట్టా మృతదేహాలను గుర్తించారు. మృత మావోయిస్టులపై మొత్తం రూ.27 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Renu Desai : కాలభైరవుడిని చంపేస్తారా? శునకాల సంహారంపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
మృతుల వద్ద నుంచి రెండు ఏకే–47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు 0.303 రైఫిళ్లు, ఒక కార్బైన్ సహా మొత్తం ఆరు ఆధునిక ఆయుధాలు, బీజీఎల్ లాంచర్, బీజీఎల్ సెల్స్, గోలీలు, పేలుడు పదార్థాలు, వైర్‌లెస్ సెట్లు, స్కానర్, మావోయిస్టు సాహిత్యం, వర్దీలు, వైద్య సామగ్రి తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీవీసీఎం దిలీప్ బెండ్జాపై బీజాపూర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 135కు పైగా కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతంలో సాల్హేపల్లి హత్య, రాణిబోడలి క్యాంప్‌పై దాడి, కాండలపర్తి, చిన్నేకాకలేరు, అన్నాపూర్ టేకామేట ఎన్‌కౌంటర్లు, పీలూర్‌లో విద్యాదూత హత్య వంటి పలు కీలక ఘటనల్లో అతడు పాల్గొన్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!