Balakrishna Arrested: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అదుపులో తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల క్రితం భార్య జ్యోతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భార్యను వరకట్న వేధింపులు, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
Read also: Turkey-Syria Earthquakes: మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న బాలకృష్ణ స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం. తన భార్య జ్యోతి స్వస్థలం కొనిజర్ల మండలం సీతారామపురం. వీరిద్దరికి 2014, ఆగస్టు 14న వీరికి వివాహమయ్యింది. ఇక బాలకృష్ణ పెళ్లైన సమయంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేశాడు. కానిస్టేబుల్ గా హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సమయంలో 2020లో గ్రూప్ టూ ద్వారా మున్సిపల్ కమిషనర్ గా ఎంపిక అయ్యాడు. దీంతో.. నిర్మల్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ ఏడాదిన్నర క్రితం మంచిర్యాలకు బదిలీ అయ్యాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలిద్దరూ నిన్న (మంగళవారం) స్కూలుకు వెళ్లిన తర్వాత జ్యోతి ఆత్మహత్య చేసుకుంది.
స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి చనిపోయి ఉండడంతో షాక్ కి గురయ్యారు.
Read also: Prakash Raj: వాళ్లు కుక్కల్లా మొరుగుతారే తప్ప కరవరు.. ద కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా
అయితే జ్యోతి తన తల్లిదండ్రులైన గంగవరపు రవీంద్ర కుమారి, రాంబాబులకు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేసింది. జ్యోతిని తన భర్త తనను చంపేసేలా ఉన్నాడని ఏడుస్తూ చెప్పినట్లు వారు చెబుతున్నారు. అయితే.. భర్త మున్సిపల్ కమిషనర్ గా ఎన్నికైన తర్వాత నుంచి తనపై వేధింపులు ఎక్కువ చేశాడని, కుటుంబ సభ్యులు అతనికి తోడయ్యారని తెలిపారు. అంతేకాకుండా.. తాను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కోట్లలో కట్నం వచ్చేదని.. అందమైన భార్య దొరికేదని పదేపదే మాటలతో హింసించేవాడని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ బయటికి చూడడానికి చాలా మంచివాడిగా కనిపించే బాలకృష్ణ ఇంట్లో సైకోలాగా శాడిస్టులాగా ప్రవర్తించేవాడని తెలిపారు.
Prakash Raj: వాళ్లు కుక్కల్లా మొరుగుతారే తప్ప కరవరు.. ద కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా