మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అదుపులో తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల క్రితం భార్య జ్యోతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భార్యను వరకట్న వేధింపులు, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. నిన్న (మంగళవారం) మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన జ్యోతి మున్సిపల్ కమిషనర్ భార్య కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.