Mallikarjuna Kharge: 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఎంతో చేసింది.. కానీ వాటిని మోడీ అమ్మేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్ధి మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రధాని మోడీ.. అమిత్ షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అంతర్గత నియమాల ప్రకారమే అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయన్న ఆయన జైపూర్ చింతన్ శివర్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు కృషి చేస్తానని అన్నారు. 17 న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు వుంటాయని, ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నామినేషన్లు దాఖలు చేశారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. 9 వేల మందికి పైగా కాంగ్రెస్ డెలిగెట్స్ ఓటు వేయనున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నాఅని అన్నారు. నాకు ఓటేయాలని అప్పీల్ చేయడానికి వచ్చా అని అన్నారు.
136 యేండ్లలో నాలుగు సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. సుభాష్ చంద్ర బోస్.. కేసరి.. సోనియాగాంధీ కోసమే ఎన్నికలు జరిగాయని ఇప్పుడు నేను అంటూ వ్యాఖ్యానించారు ఖర్గే. మోడీ హయం లో ఉద్యోగం లేదు..ఉపాధి లేదు, ఒక్క శాతం మంది దగ్గరే దేశ సంపద వుందని, ఎనిమిది ఏండ్ల లో 7 లక్షల ఉద్యోగాలు పోయాయని మండిపడ్డారు. డాలర్ తో రూపాయి విలువ 82.8 అయ్యిందని అన్నారు. పెట్రోల్.. పాలు.. పెరుగు.. విద్యార్ఫుల బుక్స్ పై కూడా GST పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ లో మోడీ ఫోటోలు పెట్టి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అని ప్రచారం చేసుకుంటున్నారని.. మరి గ్యాస్ ధర గురించి కూడా చెప్తే బాగుండేదని ఎద్దేవ చేశారు.
విహెచ్, ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ
అయితే.. సభ నేపథ్యంలో.. పీసీసీ మెంబర్స్ సమావేశంలో విహెచ్, ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ నెలకొంది. ఓబీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని వీహెచ్ అనడంతో..వీహెచ్ కి మైక్ ఇచ్చిన ఖర్గే .. మైక్ లేకుండానే మాట్లాడు మైక్ లో మాట్లాడితే మేము Ent డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది అంటూ వీహెచ్ పై సెటైర్లు వేశారు. వీహెచ్ మాట్లాడిన తర్వాత ఓబీసీ ఓట్లన్నీ నాకు పడ్డట్టే అంటూ ఖర్గే చలోక్తులు పలికారు. అనంతరం మల్లికార్జున ఖర్గే విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Munugode By poll: మునుగోడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన బీజేపీ.. నేమినేషన్ ఎప్పుడంటే..