Munugode By poll: ఉప ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి సోమవారం 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొంటారు… నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read also: Man-eating Tiger: మనిషి మాంసానికి మరిగిన పులి.. చంపేయాలంటూ సర్కార్ ఆదేశాలు
ముందస్తు ఎన్నికల్లో ఎలా ఉండాలో ప్రచార ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తున్న పార్టీ నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా జరుగుతున్న 3 ఉప ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనలో భాగంగా రాజగోపాల్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పట్ల సానుకూల వైఖరితో ప్రకటనలు గుప్పిస్తున్నారు. రేపు మునుగోడులో బీజేపీ పోలింగ్ బూత్ ఇంఛార్జీలతో తరుణ్ చుగ్ భేటీ కానున్నారు. సోమవారం నామినేషన్ దాఖలు కోసం రిటర్నింగ్ అధికారిని సమయం ఆడిగామని పార్టీ నేతలు తెలిపారు. రేపు మునుగోడు కు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వస్తున్నారని బీజేపీ నేతలు వెల్లడించారు.
Vemula Prashanth Reddy: రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు