Harsha Missing Case: మల్కాజ్గిరిలో బాలుడు హర్ష వర్ధన్ కిడ్నాప్ సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నాపర్స్ లో నలుగురు మేకర్స్ ఉండగా.. ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు సమాచారం. కిడ్నాప్ లో కీలక పాత్ర పోషించిన ఓ మైనర్ బాలుడు గుర్తించారు అధికారులు. క్రికెట్ బాల్ కొందామని హర్ష వర్ధన్ ను కారు ఎక్కించిన మైనర్ బాలుడు ఆపై కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కిడ్నాప్ చేసిన నిందితులు మొదటి రోజు బాలుడిని ఆలేరులో ఓ ఫామ్ హౌస్ లో దాచినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడి నుండి ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఒకచోట నుంచి ఇంకో చోటికి కారులో తిప్పినట్లు సమాచారం. హర్షవర్ధన్ కిడ్నాప్ లో ప్రధాన నిందితులు కడప జిల్లాకు చెందిన శివగా పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ట్రేడింగ్లో భారీగా డబ్బు పోగొట్టుకున్న శివ.. నష్టాన్ని పూడ్చుకోవడానికి కిడ్నాప్ కు ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. బాలుడు ప్లాన్ ను కడప నుండి శివ స్కెచ్ వేసినట్లు తెలిపారు. మైనర్ బాలుడితో సహా మొత్తం నలుగురుతో ముఠా ఏర్పాటు చేశారు. కిడ్నాప్ ప్లాన్ ను కడప నుండే శివ డైరెక్ట్ చేసినట్లు గుర్తించారు. కిడ్నాప్ అనంతరం డబ్బు అందాక బాలుడు గత మరిచిపోయేలా స్నేహితులతో కలిసి శివ సర్జరీ ప్లాన్ చేసినట్లు గుర్తించారు. దీంతో నిందితులను అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
Read also: Hebah Patel : హాట్ అందాలతో రెచ్చగొడుతున్న హెబ్బా పటేల్..
ఎనిమిదవ తరగతి చదువుతున్న హర్షవర్థన్ ఈనెల 15న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. రోడ్డు మీదకి నడుచుకుంటూ వస్తున్నట్లు సీసీ కెమెరాల్లో దృష్యాలు రికార్డు అయ్యాయి. ఆతరువాత హర్ష కనిపించలేదు. తమ కొడుకు హర్షవర్థన్ ని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు వాపోయారు. ఇద్దరి పై అనుమానం వ్యక్తం చేశారు. హర్షను కిడ్నాప్ పై తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రమేశ్ అనే వ్యక్తితో వ్యాపారలావాదేవీల్లో విభేదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు. గత మూడు నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా నే తన కొడుకును కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు రమేశ్ సమాచారం ఇచ్చామంటున్న తండ్రి తెలిపాడు.
మేనమామ కొడుకుకి తన కూతురుని ఇవ్వక పోవడంతో మాపై కక్ష్య పెట్టుకున్నాడని అన్నారు. గతంలోనే పది లక్షలు ఖర్చు చేసైనా మీ అంతు చూస్తానని బెదిరించాడని హర్ష తండ్రి తెలిపాడు. ఇతని పైన అనుమానం ఉందంటున్న తల్లి దండ్రులు ఆరోపించారు. అయితే దీనిపై ఆరా తీసిన పోలీసులకు ఏపీ చెందిన శివ స్కెచ్ వేసినట్లు వెలుగులోకి రావడంతో.. దర్యాప్తు చేయగా అసలు గుట్టు రట్టైంది. హర్ష కిడ్నాప్ కేసులో శివనే మొదటి సూత్రధారిగా నిర్ధారించారు. అయితే హర్ష ఫ్యామిలీతో శివ ఎలా పరిచయమని ఆరా తీస్తున్నాడు. శివకు సహకరించిన వారితో హర్ష ఎందుకు వెళ్లాడు? వీరందరూ హర్షకు ప్యామిలీకి ముందే తెలుసుంటేనే బాలుడు వారితో వెళతాడు కదా? అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. హర్ష కిడ్నాప్ కు మూలాలు ఏపీలోని కడపకు చెందిన వ్యక్తి శివ కావడంతో ఉత్కంఠగా మారింది.
PM Modi: రష్యాపై భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..