తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఆపండీ అంటూ సవాల్ విసిరారు. ప్రజలు ఎన్నుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ సీఎం కు ప్రధాని మోడీ భయం పట్టుకుందని అందుకే ఆయన తెలంగాణకు వస్తే కేసీఆర్ ఏవో పనులు కల్పించుకుని మొహం చాటేస్తున్నాడని ఎద్దేవ చేసారు. తెలంగాణకు రెండేళ్లలో కేంద్రం ఇచ్చిన వరద సహాయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేసారు.
కాగా.. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసినట్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ ఇటీవల బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం విధితమే.. ఇందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కూడా కనిపిస్తాయి అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసి బీజేసీ అధిష్టానం శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్ని రాజకీయ పరిణామాల మధ్య సీఎం ఉద్ధవ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చి వేసింది. ఈనేపథ్యంలో.. క్యాంపు రాజకీయాలతో శివసేన ఎమ్మెల్యేలు..ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్ధతుతో శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేను సీఎంగా మాజీ సీఎం ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎంగా నియమించింది. అయితే.. అటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అని, దమ్ముంటే సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
VR: మీడియాకు క్షమాపణలు చెప్పిన కిచ్చా సుదీప్!