Mahbubabad: మహబూబాబాద్ జిల్లా పొనుగోడులోని స్టోన్స్ క్రస్సర్లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ చేశారు. దీంతో.. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులోని రేణుక స్టోన్స్ క్రస్సర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ తో తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రస్సర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు అడ్డగించారు. బాంబు పేలుళ్ళకు ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి గ్రామస్తులు రోడ్లపైకి పరుగులు తీశారు. అంతేకాకుండా.. భారీ పేలుళ్ళకు ఇళ్ల గోడలకు బీటలు, ప్రమాదకరంగా నెర్రలు పడ్డాయని ఆరోపిస్తున్నారు.
Read Also: Health Tips : ఉదయం లేవగానే స్వీట్స్ లాగిస్తున్నారా? ఇది వింటే జన్మలో స్వీట్స్ తినరు..
అంతేకాకుండా.. భారీ బండరాళ్లకు పెద్ద పెద్ద రంద్రాలతో ప్రధాన రహదారులు నాశనమవుతున్నాయి గ్రామస్తులు వాపోతున్నారు. మరోవైపు.. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంట పొలాలలో భారీ బండరాళ్ళు ఎగిరి పడడంతో భారీగా పంట నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్లాస్టింగ్ ఘటన.. నెక్కొండ రహదారి పక్కనే క్రషర్ లో పేలుళ్ళు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయం భయంతో ప్రయాణిస్తున్నారు. బ్లాస్టింగ్ తో ధూళి, దుమ్ముతో ఇబ్బంది పడుతున్నామని గాజులగట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో.. రాత్రి క్రషర్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రిజిస్ట్రేషన్ ప్రకారం.. క్రషర్ ఉంది పొనుగోడు శివారులో ఉండాలి కానీ.. గాజులగట్టుకు ఆనుకోని ఉండటంతో దాదాపు 25 ఇళ్లకు బీటలువారాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Vijay Sethupathi Katrina Kaif: క్రిస్మస్ సినిమా సంక్రాంతికి వస్తుంది…